టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దృష్టిలో ఉంచుకుని, సెంటిమెంట్ కారణంగా అప్పట్లో బస చేసిన ITC నర్మద హోటల్‌ను వదిలి తాజ్ స్కైలైన్‌కు మారింది. అహ్మదాబాద్‌లో రేపు న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుండగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల చంద్రగ్రహణం సమయంలో కూడా జట్టు ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే.