ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం కొత్త పాత్రలో కనిపిస్తున్నారు. సాధారణంగా కోచ్‌గా గుర్తింపు పొందిన ద్రవిడ్.. ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.
డబ్లిన్ గార్డియన్స్ జట్టు కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ద్రవిడ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యజమాని హోదాలో ఉన్నప్పటికీ ద్రవిడ్ జట్టు నిర్వహణలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం కారణంగా జట్టు పరిస్థితులు, ఫలితాలపై ఆయనకు మంచి అవగాహన ఉందని తెలిపారు.
టోర్నీ ప్రారంభంలో డబ్లిన్ గార్డియన్స్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లకు పూర్తి మద్దతుగా నిలిచారని రాథోడ్ పేర్కొన్నారు. జట్టు నుంచి ఇలాంటి సహకారమే ఎప్పుడూ ఆశిస్తున్నామని చెప్పారు.
మరోవైపు డబ్లిన్ గార్డియన్స్ క్రికెట్ వ్యవహారాల్లో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నారని విక్రమ్ రాథోడ్ తెలిపారు. ఆటగాళ్ల ఎంపిక, వ్యూహాల రూపకల్పన, రోజువారీ క్రికెట్ నిర్ణయాలను అశ్విన్ ఎక్కువగా చూసుకుంటున్నారని వెల్లడించారు.
అశ్విన్‌కు క్రికెట్‌పై అపారమైన పరిజ్ఞానం ఉందని, ప్రపంచవ్యాప్తంగా జరిగే మ్యాచ్‌లను గమనిస్తూ ఆటగాళ్లపై పూర్తి అవగాహన కలిగి ఉంటారని రాథోడ్ ప్రశంసించారు. అతడి సహకారంతో తన పని మరింత సులభమైందని తెలిపారు.
రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్
1
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati