ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రిపబ్లికన్ పార్టీకి చట్టసభల్లో మెజారిటీ లభిస్తే వయోజన అమెరికన్లకు ఒక్కొక్కరికి 5 వేల డాలర్ల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ చెల్లింపులకు ‘ట్రంప్ డివిడెండ్’ అనే పేరు పెట్టారు.
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ డబ్బును అమెరికాలో మాత్రమే ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేశారు. కెనడా, చైనా, జర్మనీ వంటి దేశాల పర్యటనలకు ఈ మొత్తాన్ని వినియోగించకూడదని పేర్కొన్నారు.
అయితే ట్రంప్ హామీపై అమెరికాలో చర్చ మొదలైంది. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు ఆశ చూపించడం చట్టపరంగా సరైనదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పథకం ఆచరణ సాధ్యమా? ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుంది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
అమెరికాలో వయోజన పౌరుల సంఖ్య దాదాపు 27 కోట్లు ఉంటుందని, అందరికీ 5 వేల డాలర్ల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు 1.3 ట్రిలియన్ డాలర్ల భారం పడుతుందని కథనంలో పేర్కొన్నారు. ఈ నిధుల విడుదలకు అమెరికా చట్టసభల అనుమతి అవసరమా అనే అంశంపై కూడా ప్రశ్నలు ఉన్నాయి.
రాజ్యాంగ నిపుణులు ఈ వ్యాఖ్యల చట్టబద్ధతపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ హామీని డొల్ల ప్రకటనగా విమర్శిస్తున్నాయి
మమ్మల్ని గెలిపిస్తే అమెరికన్లకు రూ.5 వేల డాలర్ల చొప్పున ఇస్తాం: ట్రంప్ హామీ
1
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati