అమరావతి: అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సానుకూల అభిప్రాయం పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అభివృద్ధితోనే ప్రజల మద్దతు, ఓటు బ్యాంక్ పెంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.
టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సుస్థిర అభివృద్ధిపై మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో మౌలిక వసతులు, నీటి వనరులు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఏపీకి గూగుల్ వంటి సంస్థలు రావడం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు, నీటి వినియోగం, రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై కూడా సీఎం వివరించారు. రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆలోచనా విధానంలో మార్పు రావాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందిగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధితో ప్రజల మద్దతు పెంచుకుందాం: సీఎం చంద్రబాబు పిలుపు
10
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati