భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: తెలంగాణలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భద్రాచలంలో పర్యటించిన ఆయన బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్ఠానం టార్గెట్ తెలంగాణగా పెట్టుకుందని తెలిపారు.
గత ప్రభుత్వాలపై విమర్శలు చేసిన బండి సంజయ్.. ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపణలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందుతున్న ఇళ్లు, సన్న బియ్యం వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యకర్తలు పోలీసు కేసులకు భయపడకుండా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని సూచించారు. తనపై 109 కేసులు ఉన్నా వెనక్కి తగ్గేది లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు: బండి సంజయ్
6
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla