హైదరాబాద్, సెప్టెంబర్ 7: జూబ్లీహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో ఉన్న కారాకారా పబ్‌లో జరిగిన ఘర్షణ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పబ్‌లో 60 మందితో పార్టీ నిర్వహించేందుకు ఎంపీ అనిల్ యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ బుక్ చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఘర్షణకు సంబంధించి రెండు వర్గాలపై బహిరంగ ప్రదేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో సుమోటో కేసు నమోదు చేశారు.
అలాగే పార్కింగ్ నుంచి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో దాడి చేసి కారు ధ్వంసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు. అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు పబ్ నిర్వహించారనే కారణంతో పబ్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. గతంలోనూ నిర్ణీత సమయం దాటి పబ్ నిర్వహణపై కేసులు నమోదైన నేపథ్యంలో, తాజా ఘటనతో కారాకారా పబ్ లైసెన్స్ రద్దుకు ఎక్సైజ్ శాఖకు పోలీసులు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ పబ్‌లో ఘర్షణ.. 3 కేసులు నమోదు, లైసెన్స్ రద్దుకు సిఫారసు
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan