తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వచ్చిన ‘వాటర్‌మన్’ కథనం ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకప్పుడు రాష్ట్ర సీఈవోగా పేరు తెచ్చుకున్న చంద్రబాబును ఇప్పుడు నీటి నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా ‘వాటర్‌మన్’గా అభివర్ణిస్తూ జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తిగా ప్రస్తావించారు.చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులు, నీటి భద్రత, నీటి సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను నేతలు గుర్తుచేశారు. పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా కల్పించడం ద్వారా కియా వంటి పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేపట్టి భారీగా నీటిని మళ్లించారని కృష్ణా-గుంటూరు జిల్లాల నేతలు ప్రశంసించారు. కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యలను తగ్గించడంలో పట్టిసీమ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ప్రాంతాల చివరి భూములకు చేరవేయడంలో కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడిందని పేర్కొన్నారు.వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశతో ప్రకాశం ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని స్థానిక నేతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంక్లేవ్‌లో పాల్గొన్న నేతలు చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు.
టీడీపీ కాంక్లేవ్‌లో ‘వాటర్‌మన్’ చంద్రబాబు.. నేతల ప్రశంసల వెల్లువ
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan