ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఓ వీధి వ్యాపారి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. భవనం పక్కనే వ్యాపారం నిర్వహిస్తున్న అతడు ప్రమాదం సంభవించబోతున్న విషయాన్ని కొన్ని క్షణాల ముందే గుర్తించి అక్కడి నుంచి పరుగెత్తాడు. అతడు అక్కడి నుంచి కదిలిన వెంటనే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.సీసీటీవీ ఫుటేజీ ప్రకారం మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో ఆ వ్యక్తి తలపైకి ఎత్తి భవనం వైపు చూశాడు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గ్రహించిన వెంటనే అక్కడి నుంచి వేగంగా పరుగెత్తాడు. మరుక్షణమే భవనం కూలిపోవడంతో భారీగా దుమ్ము, ధూళి పైకి లేచింది. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పోలీసుల సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన భవనాన్ని హాస్టల్‌గా వినియోగిస్తున్నారు. భవనానికి బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్నాయి. ప్రమాద సమయంలో బేస్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే భవనం కూలడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు మరణించినట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా, మిగిలిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ హాస్టల్ కూలే క్షణాల్లో అప్రమత్తం.. పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్న వీధి వ్యాపారి
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan