విజయవాడ ఉత్సవ్-2.0లో భాగంగా నిర్వహించిన మెగా కార్నివాల్ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంఖం పూరించి సాంస్కృతిక కవాతును ప్రారంభించారు. విజయవాడ ఉత్సవ రథంతో కార్నివాల్ ప్రారంభమైంది.
కాకరపర్రు, కడియం పూలతో రథాన్ని అందంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అమ్మవారి చిత్రాన్ని రూపొందించడం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. గుర్రాలు, ఒంటెలతో కళాకారులు చేసిన ప్రదర్శనలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.
డప్పు, సన్నాయి వాయిద్య బృందాలు, గరడి కళాకారుల ప్రదర్శనలు కార్నివాల్‌కు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవం, ఐక్యత, చరిత్రను ప్రతిబింబించేలా వివిధ కళారూపాలను ప్రదర్శించారు.
కార్నివాల్లో పాల్గొన్న కళాబృందాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వివిధ కళారూపాలతో రూపొందించిన బేతాళం సెట్లను నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. మెగా కార్నివాల్ సందర్భంగా ఏలూరు రోడ్ సందడిగా మారింది. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళాకారుల ప్రదర్శనలను వీక్షించడంతో పాటు వాటిని సెల్ఫోన్లలో చిత్రీకరించారు. సంప్రదాయ కళలు, సాంస్కృతిక వైవిధ్యంతో విజయవాడ ఉత్సవ్-2.0కు మెగా కార్నివాల్ ప్రత్యేక శోభను తీసుకొచ్చింది.
విజయవాడ ఉత్సవ్-2.0లో మెగా కార్నివాల్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
10
Published: 📅
Reported by: 🖊
Banu Prakash