కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాపై నమోదైన ఒక కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేసిన తర్వాత కూడా అక్కడ ఆందోళనకు ప్రయత్నించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అక్టోబర్ 13న దాస్, రాంకాతో పాటు మరో 11 మంది సీజేపీ సభ్యులు జంతర్‌మంతర్ వద్ద నిరసనకు ప్రయత్నించగా, బారికేడ్లు ఎక్కిన వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు కథనం పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఇచ్చిన బాండ్లను ఉల్లంఘించారనే కారణంతో అక్టోబర్ 14న స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అనంతరం కస్టడీని మరో రెండు రోజులు పొడిగించినట్లు సమాచారం.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని ఇచ్చిన బాండ్‌ను ఉల్లంఘించడం, పోలీసు బారికేడ్లను దాటి డీనోటిఫైడ్ ప్రాంతంలోకి వెళ్లడం వంటి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరో కేసును కూడా ముందుగా క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు కథనం తెలిపింది.
సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ
5
Published: 📅
Reported by: 🖊
Kanakadri