విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు నిండాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి గెలిచిన పవిత్రమైన రోజు విజయదశమి అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలు చేపట్టే ప్రతి పనిలో విజయాలు సాధించాలని కోరుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా విజయదశమిని అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడలో జరిగిన జాతీయస్థాయి సరస్ మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పవన్ పేర్కొన్నారు. ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, నారా లోకేశ్
8
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk