విజయవాడలో దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఒకవైపు విజయవాడ ఉత్సవ్-2లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరిస్తుండగా, మరోవైపు పున్నమిఘాట్లో ఏర్పాటు చేసిన సరస్ మేళా సందర్శకులను ఆకర్షిస్తోంది.
ఆదివారం రాత్రి పున్నమిఘాట్లో జరిగిన కార్యక్రమాల్లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలతో ఆకట్టుకున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కార్యక్రమానికి హాజరయ్యారు. విజయవాడతో తనకు ఉన్న అనుబంధాన్ని రాఘవేంద్రరావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కళాభిమానులను అలరించాయి. ‘చంద్రయాన్’ సినిమా బృందం సందడి చేయగా, హీరో శివకుమార్ ప్రసంగించారు.
ఇక సరస్ మేళాలో వివిధ రకాల వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు, ఇతర వస్తువుల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూసేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పలు స్టాళ్లను సందర్శించి మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడారు.
దసరా వచ్చిందయ్యా.. విజయవాడలో ఉత్సవ్-2, సరస్ మేళాతో సందడి
7
Published: 📅
Reported by: 🖊
Kanakadri