రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా ఐరోపా దేశాలను కోరినప్పటికీ అవి అందుకు అంగీకరించలేదని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచే బాధ్యతను అమెరికా మాత్రమే ఎందుకు మోయాలని ఆయన ప్రశ్నించారు.
ఐరోపా దేశాలు ఇప్పటికీ రష్యా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని బెసెంట్ విమర్శించారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిచేయాలంటే మిత్రదేశాలన్నీ సమానంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అమెరికాపై విమర్శలు చేస్తూనే రష్యా నుంచి భారీగా ఇంధనం, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయడం విరుద్ధ ధోరణిగా ఉందని వ్యాఖ్యానించారు.
రష్యా చమురు కొనుగోలుదారులపై గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదన నుంచి భారత్‌కు తాత్కాలిక మినహాయింపులు ఇవ్వడాన్ని బెసెంట్ సమర్థించారు. భారత్‌తో అమెరికాకు కీలక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత్ ఒక్కరోజులో రష్యా చమురు దిగుమతులను నిలిపివేయడం సాధ్యం కాదని తెలిపారు. సుంకాల ప్రభావాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు నెలల్లో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
భారత్‌పై అదనపు సుంకాలకు ఐరోపా దేశాలు ఒప్పుకోలేదు: స్కాట్ బెసెంట్
5
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk