2009లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో జరిగిన సామూహిక కాల్పుల కేసులో దోషిగా తేలిన మాజీ ఆర్మీ మేజర్ నిదల్ హసన్‌కు మరణశిక్ష అమలు చేయనున్న నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా సమర్థించారు. వైట్‌హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడిన ట్రంప్, హసన్‌ను అత్యంత క్రూరమైన హంతకుల్లో ఒకడిగా అభివర్ణిస్తూ, అతనికి మరణశిక్ష విధించడం సరైన చర్య అని పేర్కొన్నారు.
నవంబర్ 5, 2009న ఫోర్ట్ హుడ్ మెడికల్ బిల్డింగ్‌లో నిదల్ హసన్ జరిపిన కాల్పుల్లో 12 మంది సైనికులు, ఒక పౌరుడు సహా మొత్తం 13 మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం జరిగిన సైనిక విచారణలో హసన్ దోషిగా తేలగా, 2013లో అతనికి మరణశిక్ష విధించారు.
డిసెంబర్ 3న మధ్యాహ్నం 1 గంటకు ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా శిక్ష అమలు చేయనున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. అమెరికా సైన్యంలో 1961 తర్వాత అమలయ్యే తొలి మరణశిక్ష ఇదే కావడం విశేషం.
అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా సైనిక మరణశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి అవుతుంది. శిక్ష అమలును ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న నిర్ణయం కూడా అమెరికాలో న్యాయ, నైతిక చర్చలకు దారితీసింది.
ఫోర్ట్ హుడ్ కాల్పుల దోషికి మరణశిక్ష.. నిదల్ హసన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
2
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati