ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఇంగ్లీష్, తెలుగు రిపోర్టర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 10 ఇంగ్లీష్ రిపోర్టర్ పోస్టులు, ఒక తెలుగు రిపోర్టర్ పోస్టు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లేదా తెలుగు షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లో హైయర్ గ్రేడ్ పాసై ఉండాలి. తెలుగు రిపోర్టర్ పోస్టుకు తెలుగు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగంతో నిర్వహించే ప్రాక్టికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లో ఉత్తీర్ణతకు ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతం లభిస్తుంది. అభ్యర్థుల ఎంపికకు ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనితో పాటు షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్, ట్రాన్స్‌క్రిప్షన్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌లను నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏపీపీఎస్సీ సూచించిన విధానంలో ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 2గా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో రిపోర్టర్ పోస్టులు.. 11 ఖాళీలు, రూ.1,47,760 వరకు జీతం
6
Published: 📅
Reported by: 🖊
Kanakadri