ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన రోడ్‌షోలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీ సందర్భంగా బుల్డోజర్ ఢీకొనడంతో స్థానిక బీజేపీ నేత ఓంకార్ సింగ్ కుమారుడు ఆర్యవర్ధన్ సింగ్ (12) ప్రాణాలు కోల్పోయాడు.
నవంబర్ 18న గోరఖ్‌పూర్‌లోని కూఢాఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి చౌరీచౌరాలోని డియోకాహి వరకు అఖిలేశ్ రోడ్‌షో కొనసాగింది.
ర్యాలీకి స్వాగతం పలికేందుకు బుల్డోజర్ సాయంతో పూలవర్షం కురిపిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు కథనం పేర్కొంది. చౌరీచౌరా పరిధిలోని రాజధాని గ్రామానికి చెందిన ఆర్యవర్ధన్‌ను బుల్డోజర్ వెనుక నుంచి ఢీకొట్టింది.
దీంతో బాలుడు ఎగిరి రోడ్డు డివైడర్‌పై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు.
రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఇంజినీర్ సర్వన్ నిషాద్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సానుభూతి తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి డాక్టర్ సంజయ్ నిషాద్ కూడా ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని ఎమ్మెల్యేకు సూచించారు.
మరోవైపు అఖిలేశ్ యాదవ్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ బాలుడు మరణించిన విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. రోడ్‌షో నిర్వహణకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన బుల్డోజర్ను స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ర్యాలీలో భారీ వాహనాల వినియోగం, ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అఖిలేశ్ యాదవ్ రోడ్‌షోలో విషాదం.. బుల్డోజర్ ఢీకొని బీజేపీ నేత 12 ఏళ్ల కుమారుడు మృతి!
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan