కృత్రిమ మేధ రంగంలో భారత సంతతికి చెందిన ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా చెరో రూ.39,591 కోట్ల సంపద కలిగిన యువ బిలియనీర్లుగా వార్తల్లో నిలిచారు.
వీరిద్దరూ అమెరికాకు చెందిన ఏఐ రిక్రూట్మెంట్ స్టార్టప్ మెర్కర్ సహ వ్యవస్థాపకులు. ఆదర్శ్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా, సూర్య బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
మెర్కర్ ఇటీవల నిర్వహించిన నిధుల సమీకరణలో 75 కోట్ల డాలర్లు సేకరించింది. దీంతో సంస్థ మొత్తం విలువ 2,000 కోట్ల డాలర్లకు చేరినట్లు కథనం పేర్కొంది.
కంపెనీలో ఆదర్శ్, సూర్యకు చెరో 21 శాతం వాటా ఉంది. తాజా కంపెనీ విలువ ఆధారంగా వారి వ్యక్తిగత వాటాల విలువ ఒక్కొక్కరికి 420 కోట్ల డాలర్లు, అంటే సుమారు రూ.39,591 కోట్లుగా అంచనా వేశారు.
మెర్కర్‌ను ఈ ఇద్దరితో పాటు బ్రెండెన్ ఫుడీ కూడా స్థాపించారు. ప్రస్తుతం ఆయన సంస్థ సీఈవోగా ఉన్నారు. ముగ్గురి వయసూ 23 ఏళ్లే కావడం విశేషం.
కథనం ప్రకారం వీరు 22 ఏళ్ల వయసులోనే బిలియనీర్ హోదా సాధించారు. స్వయంకృషితో సంపద సృష్టించిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో స్థానం సంపాదించారు.
ఆదర్శ్, సూర్య అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. విద్యార్థి దశలోనే ఇద్దరూ డిబేట్ టీమ్‌లో చురుగ్గా పాల్గొన్నారు.
ఒకే ఏడాదిలో మూడు నేషనల్ పాలసీ డిబేట్ చాంపియన్‌షిప్‌లు గెలుచుకుని తమ పాఠశాల చరిత్రలో రికార్డు నెలకొల్పినట్లు కథనం వెల్లడించింది.
అనంతరం 2023లో బ్రెండెన్ ఫుడీతో కలిసి మెర్కర్‌ను ప్రారంభించారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించడంపై ఈ సంస్థ దృష్టి సారించింది.
తాజా పెట్టుబడుల సమీకరణతో కంపెనీ మార్కెట్ విలువ భారీగా పెరగడం వ్యవస్థాపకుల సంపద అంచనాలను కూడా పెంచింది.
23 ఏళ్లకే రూ.39 వేల కోట్ల సంపద.. ఏఐ రంగంలో భారత సంతతి యువకుల సంచలనం!
2
Published: 📅
Reported by: 🖊
Kanakadri