హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకున్న మూడు హత్యలు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 9 రోజుల వ్యవధిలో ముగ్గురు యువతులు తమ ప్రేమికుల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు కథనం పేర్కొంది. ప్రేమ పేరుతో యువతులను నమ్మించి, పెళ్లి చేసుకుంటామని చెప్పి, తీరా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు వాగ్వాదాలకు దిగడం, అనంతరం హత్యలకు పాల్పడటం ఈ ఘటనల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా హోటళ్లు, లాడ్జిలను మాట్లాడుకునే ప్రదేశాలుగా ఎంచుకుని నేరాలకు పాల్పడినట్లు కథనం తెలిపింది.
సెప్టెంబరు 22న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న యువతిని విశాఖపట్నంకు చెందిన శ్రీనివాస రవితేజ ప్రేమించాడు. ఆమెను మాదాపూర్ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో యువతిపై దాడి చేశాడు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
సెప్టెంబరు 29న ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లాడ్జిలో మరో మహిళ హత్యకు గురైంది. వికారాబాద్‌కు చెందిన శ్రీనివాస్.. ప్రేమ పెళ్లి పేరుతో వంచించిన శిరీషను హైదరాబాద్‌కు తీసుకొచ్చి లాడ్జిలో దిగాడు. పెళ్లి విషయమై వాగ్వాదం జరగడంతో ఆమెను హత్య చేసి పరారయ్యాడు.
అక్టోబరు 1న మియాపూర్ పరిధిలోని హోటల్లో ఓ వైద్య విద్యార్థిని హత్యకు గురైంది.
9 రోజుల్లో ముగ్గురు యువతుల హత్యలు.. హోటళ్లు, లాడ్జిలే అడ్డాగా మారిన దారుణాలు
13