హైదరాబాద్‌లో వాటర్‌బిల్ పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వాటర్‌బోర్డు సూచించింది. వాటర్‌బిల్ అప్డేట్, బిల్లు బకాయి, కనెక్షన్ తొలగింపు వంటి కారణాలను చెప్పి సైబర్ నేరగాళ్లు ప్రజలను సంప్రదిస్తున్నారని తెలిపింది. వాటర్‌బోర్డు పేరుతో ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలు పంపి, లింకులు లేదా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయాలని కోరితే స్పందించవద్దని స్పష్టం చేసింది.
అదేవిధంగా మొబైల్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలని లేదా స్క్రీన్ షేరింగ్, రిమోట్ యాక్సెస్ ఇవ్వాలని ఎవరైనా కోరితే అనుమతించకూడదని వాటర్‌బోర్డు హెచ్చరించింది. ఇలాంటి చర్యల ద్వారా సైబర్ నేరగాళ్లు మొబైల్ పరికరాలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ముఖ్యంగా ఓటీపీ, యూపీఐ పిన్ నంబర్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పాస్వర్డ్ వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించవద్దని తెలిపింది. నీటి బిల్లుల చెల్లింపులు, బిల్లు వివరాల పరిశీలన కోసం వాటర్‌బోర్డు అధికారికంగా అందుబాటులో ఉంచిన మార్గాలను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.
ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని, అలాగే సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాటర్‌బోర్డు వినియోగదారులను కోరింది.
వాటర్ బిల్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని వాటర్‌బోర్డు హెచ్చరిక
18
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan