పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణకు చెందిన ఎంపీలకు పలు కీలక బాధ్యతలు దక్కాయి. వివిధ శాఖలకు సంబంధించిన కమిటీల్లో రాష్ట్ర ఎంపీలకు సభ్యత్వం కల్పించారు. విదేశీ వ్యవహారాల కమిటీలో కె.లక్ష్మణ్, డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీ సభ్యులుగా ఉన్నారు. గృహ, పట్టణ వ్యవహారాల కమిటీలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, వాణిజ్య వ్యవహారాల కమిటీలో రేణుకా చౌదరి చోటు పొందారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీలో బి.పార్థసారథిరెడ్డి, కడియం కావ్య ఉండగా, పరిశ్రమల కమిటీలో ధర్మపురి అర్వింద్, మల్లు రవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సభ్యులయ్యారు. సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, చట్టం, న్యాయ కమిటీలో ఎం.రఘునందన్‌రావు; సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, వాతావరణ మార్పుల కమిటీలో గడ్డం వంశీకృష్ణకు అవకాశం దక్కింది.
రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలో సురేశ్‌కుమార్ షెట్కార్, రసాయనాలు, ఎరువుల కమిటీలో పోరిక బలరాం నాయక్, ఈటల రాజేందర్ సభ్యులుగా నియమితులయ్యారు. బొగ్గు, గనులు, ఉక్కు కమిటీలో అనిల్‌కుమార్ యాదవ్, సమాచార ప్రసార, సమాచార సాంకేతిక కమిటీలో రఘురామిరెడ్డి, ఆహారం, ప్రజాపంపిణీ కమిటీలో ఆర్.కృష్ణయ్య, రక్షణ కమిటీలో దామోదర్‌రావుకు చోటు లభించింది.
ఇంధన కమిటీలో వేంనరేందర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి; సామాజిక న్యాయం, సాధికారత కమిటీలో గోడెం నగేశ్, పెట్రోలియం, సహజవాయువు కమిటీలో వద్దిరాజు రవిచంద్ర సభ్యులుగా నియమితులయ్యారు. దీంతో వివిధ కీలక విధాన రంగాల్లో తెలంగాణ ఎంపీలకు విస్తృత ప్రాతినిధ్యం దక్కింది.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు కీలక బాధ్యతలు
2
Published: 📅
Reported by: 🖊
Banu Prakash