వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల విద్యాప్రణాళికను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూలో నిర్వహించిన ‘రీసెర్చ్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్‌మెంట్ కాన్‌క్లేవ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 25 విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లు, వివిధ రంగాల పారిశ్రామిక ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రస్తుతం ఉన్న డిగ్రీ కేంద్రీకృత విద్యా విధానం నుంచి నైపుణ్య కేంద్రీకృత విధానం వైపు మారాల్సిన సమయం వచ్చిందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేవలం డిగ్రీ కలిగి ఉండటం మాత్రమే ఉద్యోగ అవకాశాలకు సరిపోదని, విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఇండస్ట్రీ అనుభవం సంపాదించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెరిగితే విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి రచించిన ‘హైదరాబాద్-ఎ హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ కల్చరల్ హెరిటేజ్’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. చారిత్రక నగరంగా పేరొందిన హైదరాబాద్ ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతున్న ప్రయాణాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సాంకేతిక మార్పులకు తగ్గట్టుగా వర్సిటీ కరిక్యులమ్ మారాలి: మంత్రి శ్రీధర్‌బాబు
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan