దక్షిణాది రాష్ట్రాలే దేశాభివృద్ధికి మూలస్తంభాలు: అమిత్షా
📅 21-08-2026
దక్షిణ భారత రాష్ట్రాలు దేశ ప్రగతికి ప్రధాన స్తంభాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను పరస్పర చర్చలతో త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. నీటి కొరతతో కొన్ని ప్రాంతాలు ఇబ్బందులు పడుతుండగా, నీరు సముద్రంలోకి వృథాగా వెళ్లడం సరికాదన్నారు. ఐటీ, ఆటోమొబైల్స్, ఔషధాలు, మౌలిక సదుపాయాల్లో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరింత బలమైన ఆర్థిక శక్తిగా ఎదగగలవని పేర్కొన్నారు.