హైదరాబాద్లోని బోడుప్పల్ పరిధిలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. బంగారు మైసమ్మ ఆలయం నుంచి ప్రివిలేజ్ కాలనీ వరకు 11 కేవీ లైన్ల మార్పిడి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు.
11 కేవీ ఎస్బీఆర్ కాలనీ ఫీడర్ పరిధిలోని పద్మావతి కాలనీ, అమ్మసాని వెంకట్ రెడ్డి కాలనీ, ఆర్ఎస్ఎస్ కాలనీ, బీఎల్ నగర్, అంజయ్య ఎన్క్లేవ్, టెలిఫోన్ కాలనీ ఫేజ్-2, పీఎన్ఆర్ కాలనీ, రెడ్డీస్ కాలనీ, భవానీ కాలనీ, శుభోదయ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, గ్రీన్ సిటీ, అనగాపురి, భీమ్ రెడ్డి, ఎన్ఐఎన్, యాదాద్రి కాలనీల్లో విద్యుత్ ఉండదు.
వివేకానంద నగర్ ఫీడర్ పరిధిలో మణికంఠ నగర్, వివేకానంద నగర్, శ్రీలక్ష్మీ నగర్, లెక్చరర్స్ కాలనీ, ఐఐసీటీ కాలనీ, భీమ్ రెడ్డి కాలనీ, అశోక్ నగర్, గ్రీన్ సిటీ, అనగాపురి కాలనీలు ప్రభావితం కానున్నాయి.
మారుతీ నగర్ ఫీడర్ పరిధిలో యాదవ్ బస్తీ, సుభాష్ నగర్, ఎస్సీ బస్తీ, మాన్సాని కాలనీ, మణికంఠ నగర్, మారుతీ నగర్, సిద్ధి వినాయక నగర్, శ్రీ సాయి ఎన్క్లేవ్లలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. నిర్వహణ పనులకు వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
హైదరాబాద్లో నేడు విద్యుత్ అంతరాయం.. బోడుప్పల్ పరిధిలో పలు కాలనీలకు పవర్ కట్
2
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan