మహారాష్ట్రలోని పుణె నగరంలో 10 ఏళ్ల బాలికపై ఆలయంలోనే లైంగిక దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిగ్డీ ప్రాంతంలోని ఓ శివాలయానికి బాలిక ఒంటరిగా వెళ్లి పూజలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పూజలు ముగించుకుని ఆలయం లోపలికి తిరిగి వెళ్తున్న చిన్నారిని గమనించిన ఓ వ్యక్తి ఆమె వద్దకు వెళ్లి బలవంతంగా పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికకు బొట్టు పెడుతున్నట్లు నటిస్తూ దగ్గరకు వెళ్లిన అతడు అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. దీంతో భయపడిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఘటన అనంతరం చిన్నారి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. వారు వెంటనే నిగ్డీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆలయంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని ఉత్తర్ప్రదేశ్కు చెందిన విశాల్ సింగ్గా గుర్తించినట్లు వెల్లడించారు. అతను ఓ మెట్రో కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేస్తున్నట్లు సమాచారం.
పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే కేసు దర్యాప్తులో ఉన్నందున, నిందితుడిపై ఆరోపణలు న్యాయ ప్రక్రియ ద్వారా తేలాల్సి ఉంది.
పుణె శివాలయంలో బాలికపై లైంగిక దాడి యత్నం.. నిందితుడు అరెస్ట్
7
Published: 📅
Reported by: 🖊
Sarika Sk