భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్‌కు ఇంకా పూర్తి క్లియరెన్స్ లభించలేదు. స్థానిక మౌలిక వసతుల ఏర్పాటు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన కొన్ని నిబంధనలపై సంస్థ అంగీకారం తెలపకపోవడమే అనుమతుల్లో జాప్యానికి కారణమని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి.
స్టార్‌లింక్ తన బేస్ స్టేషన్లను భారత్‌లోనే ఏర్పాటు చేయాలని, దేశ భద్రతకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ బేస్ స్టేషన్ల ద్వారానే వినియోగదారులు శాటిలైట్ ఆధారిత వైర్లెస్ నెట్‌వర్క్‌కు అనుసంధానమవుతారు. స్థానిక మౌలిక వసతులు, భద్రతా చర్యలు పూర్తయితే స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి అభ్యంతరం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదే రంగంలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన యూటెల్‌శాట్ వన్‌వెబ్, రిలయన్స్ జియో కూడా అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాయి. భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ సునీల్ భారతీ మిట్టల్ తమ సంస్థ చాలా కాలంగా అనుమతుల ప్రక్రియలో ఉందని పేర్కొన్నారు.
మరోవైపు స్టార్‌లింక్ అనుమతుల్లో ఆలస్యంపై ఎలాన్ మస్క్ విమర్శలు చేస్తూ, భారత వ్యాపార వర్గాలపై ఆరోపణలు చేశారు. అయితే భారత అధికారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, దేశంలోని చట్టాలు, నియంత్రణ నిబంధనలు అన్ని సంస్థలకు సమానంగానే వర్తిస్తాయని స్పష్టం చేసినట్లు కథనం పేర్కొంది.
భారత్‌లో స్టార్‌లింక్‌కు ఇంకా క్లియరెన్స్ లేదు.. నిబంధనలు పాటించాల్సిందేనన్న ప్రభుత్వ వర్గాలు
8
Published: 📅
Reported by: 🖊
Kanakadri