అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న విమానం కూలిపోవడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. విస్కాన్సిన్ డెల్స్కు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
సాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరు సీట్లు కలిగిన సింగిల్ ఇంజిన్ పైపర్ PA-46 విమానం కెనోషా నుంచి మెనోమోనీకి బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి సుమారు 9:30 గంటలకు డెల్లోనా పట్టణానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో విమానం కూలిపోయింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో భూమిపై ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. విమాన శకలాలు, వాతావరణ పరిస్థితులు, పైలట్కు సంబంధించిన వివరాలను పరిశీలించిన అనంతరం ప్రమాదానికి ఖచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
5
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk