ఓపెన్ఏఐ శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూమ్లో రహస్య ఆడియో రికార్డింగ్ పరికరాన్ని అమర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్ అబ్దుల్రహ్మాన్ అల్ఫోజాన్ను FBI అరెస్ట్ చేసింది. అమెరికా న్యాయశాఖ ప్రకారం, 35 ఏళ్ల అల్ఫోజాన్ సౌదీ అరేబియా పౌరుడు కాగా, 2025 జూలై నుంచి ఓపెన్ఏఐలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
సెప్టెంబర్ 30న ఎగ్జిక్యూటివ్ సమావేశ గదిలోని టీవీ వెనుక USB పోర్టులో అమర్చిన రహస్య పరికరాన్ని ఓపెన్ఏఐ సిబ్బంది గుర్తించారు. ఆ పరికరాన్ని టాయిలెట్ పేపర్తో కప్పి దాచినట్లు, దానిలోని డేటా ఎన్క్రిప్ట్ చేసి ఉన్నట్లు ఫెడరల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 28 ప్రాంతంలో పరికరం అమర్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
సీసీటీవీ దృశ్యాల్లో అల్ఫోజాన్ అనుమతి లేకుండానే ఆ గది పరిసరాల్లో కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 5న అతని బ్యాగులో మరో సమానమైన రికార్డింగ్ పరికరం కూడా లభించినట్లు న్యాయశాఖ తెలిపింది. ఆ గదిలో సాంకేతిక పరిశోధన, ఉత్పత్తి ప్రణాళికలు, ప్రభుత్వ సంబంధాలు, వాణిజ్య వ్యూహాల వంటి గోప్య అంశాలపై సమావేశాలు జరుగుతుంటాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అల్ఫోజాన్ను అక్టోబర్ 9న అరెస్ట్ చేశారు. దోషిగా తేలితే గరిష్ఠంగా ఐదేళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఆరోపణలు కోర్టులో నిరూపితమయ్యే వరకు అతడిని నిర్దోషిగానే పరిగణించాలి.
ఓపెన్ఏఐ ఎగ్జిక్యూటివ్ రూమ్లో సీక్రెట్ రికార్డర్.. ఇంజినీర్ అరెస్ట్
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri