టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై ఆయన మాజీ భార్య, కెనడియన్ రచయిత్రి జెన్నిఫర్ జస్టిన్ విల్సన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుమార్తె వీవియన్ జెన్నా విల్సన్ ట్రాన్స్‌జెండర్‌గా తన గుర్తింపును వెల్లడించిన మరుసటి రోజే మస్క్ ఆమె హెల్త్ ఇన్సూరెన్స్‌ను రద్దు చేశారని ఆమె పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత అలెక్స్ గిబ్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మస్క్’ డాక్యుమెంటరీలో ఈ వివరాలను పంచుకున్నట్లు కథనం తెలిపింది.
వీవియన్ తన ట్రాన్స్‌జెండర్ గుర్తింపును వెల్లడించిన రోజున మస్క్ మద్దతుగా మాట్లాడారని, కానీ తర్వాత రోజు బీమాను నిలిపివేశారని విల్సన్ ఆరోపించారు. వీవియన్ చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలు కలిగి ఉండేదని, మస్క్ మాత్రం క్రమశిక్షణ పేరుతో ఆమెపై ఒత్తిడి చేసేవారని కూడా ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం 22 ఏళ్ల వీవియన్ 2022లో తాను ట్రాన్స్‌జెండర్ అని బహిరంగంగా వెల్లడించారు. తన తండ్రితో సంబంధం కొనసాగించాలనే ఆసక్తి లేదని ఆమె అప్పట్లో కోర్టు పత్రాల్లో పేర్కొన్నట్లు కథనం తెలిపింది.
అయితే జెన్నిఫర్ విల్సన్ చేసిన ఆరోపణలను ఎలాన్ మస్క్ తిరస్కరించారు. తనను ఉద్దేశపూర్వకంగా ప్రతికూలంగా చూపించేందుకు ఈ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారని ఆయన విమర్శించినట్లు కథనం పేర్కొంది. మస్క్ మాజీ భాగస్వామి ఆష్లీ సెయింట్ క్లేర్ కూడా డాక్యుమెంటరీలో పాల్గొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
కన్న బిడ్డ హెల్త్ ఇన్సూరెన్స్‌ను రద్దు చేశారంటూ మస్క్‌పై మాజీ భార్య ఆరోపణ
4
Published: 📅
Reported by: 🖊
Sarika Sk