భారత్, వెస్టిండీస్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ విచిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు. బంతి బౌండరీ దాటిపోయిందని పొరబడటంతో అతడు వికెట్ కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో వెస్టిండీస్ బౌలర్ గుడాకేశ్ మోటి బౌలింగ్‌లో అక్షర్ పటేల్ బంతిని లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లిపోయిందని భావించిన అక్షర్, తిలక్ వర్మ ఒక పరుగు పూర్తి చేసిన తర్వాత మైదానం మధ్యలోనే ఆగిపోయారు. బౌండరీ వచ్చినట్లుగా భావిస్తూ ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు.
కానీ వెస్టిండీస్ ఫీల్డర్ కమిల్ పూరన్ వేగంగా బంతి వైపు వెళ్లి బౌండరీకి చేరకుండా అడ్డుకున్నాడు. అనంతరం బంతిని వికెట్‌కీపర్‌కు అందించాడు. అప్పటికే ప్రమాదాన్ని గుర్తించిన అక్షర్ పటేల్ వేగంగా తన క్రీజులోకి చేరుకున్నాడు.
తిలక్ వర్మ మాత్రం పరిస్థితిని వెంటనే గుర్తించలేక బౌలర్ ఎండ్ క్రీజుకు బయటే నిలిచిపోయాడు. కీపర్ నుంచి బంతిని అందుకున్న గుడాకేశ్ మోటి వికెట్లను పడగొట్టాడు. నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు పంపగా, రీప్లేలో తిలక్ క్రీజుకు బయట ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో అతడిని రనౌట్‌గా ప్రకటించారు. ఊహించని విధంగా వికెట్ కోల్పోయిన తిలక్ షాక్‌కు గురయ్యాడు. ఈ రనౌట్ క్రికెట్ అభిమానుల్లో విస్తృత చర్చకు దారితీసింది.
బంతి బౌండరీ అనుకుని ఆగిపోయాడు.. విచిత్రంగా రనౌట్ర్మ అయిన తిలక్ వ
3