భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్, వైభవ్ ఆటతీరు తన ఆలోచనా విధానానికి దగ్గరగా ఉందని పేర్కొన్నాడు.
తొలి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయాలని వైభవ్ భావిస్తాడని, తాను కూడా తన కెరీర్‌లో ఇదే దూకుడు ధోరణితో బ్యాటింగ్ చేసేవాడినని సెహ్వాగ్ వివరించాడు. భారత సీనియర్ జట్టులో వైభవ్‌కు ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడన్నదే ఇప్పుడు ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాడి వయసు కంటే ప్రతిభ, ప్రదర్శనే ప్రధాన ప్రమాణంగా ఉండాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అండర్-19 వంటి వయోపరిమితి టోర్నీల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, అయితే ఐపీఎల్ లేదా భారత సీనియర్ జట్టులో ఎంపికకు ఆటతీరే కీలకమని చెప్పాడు.
38 ఏళ్ల విరాట్ కోహ్లీ అయినా, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అయినా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే అవకాశాలు ఇవ్వాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిలకడగా రాణిస్తే వయసు వంటి ఇతర అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
వైభవ్ నాలాగే ఆలోచిస్తున్నాడు: వీరేంద్ర సెహ్వాగ్
2
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati