విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి, ఉత్సాహానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి ఒక్కరి సంకల్పానికి కొత్త శక్తిని అందించాలని ఆకాంక్షించారు.
ప్రజల జీవితాలు సుఖసంతోషాలు, సౌభాగ్యం, విజయాలతో నిండిపోవాలని ప్రధాని ఎక్స్ వేదికగా కోరుకున్నారు. విజయదశమి ప్రజల్లో సానుకూలత, ధైర్యం, నూతన ఉత్సాహాన్ని నింపే పర్వదినమని సందేశం ఇచ్చారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయాన్ని స్మరించుకునే ఈ పండుగ అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి ధర్మం, నైతికత, కర్తవ్యబోధ వంటి విలువలపై ఆధారపడి ఉందని ఆమె తెలిపారు. దేశ ప్రజలు తమ వారసత్వంలోని ఉన్నత ఆదర్శాలను అనుసరిస్తూ అభివృద్ధి చెందిన భారత్, సామరస్యపూర్వక సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ పవిత్ర సందర్భంలో దేశ ప్రజలందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, సుఖసంతోషాలు కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము
6
Published: 📅
Reported by: 🖊
Sarika Sk