భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశాలు తగ్గుతున్నాయనే అంశంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు జైస్వాల్ ఎంపిక కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కడం సులభం కాదని అభిప్రాయపడ్డాడు.
జట్టులో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌తో పాటు బ్యాకప్ ఓపెనర్‌గా కూడా సేవలు అందించగలడని చోప్రా వివరించాడు. ఒకే ఆటగాడు రెండు పాత్రలు పోషించగలగడం వల్ల అదనపు బ్యాటర్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం తగ్గుతుందని అన్నాడు. దీంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు పరిమితమవుతున్నాయని పేర్కొన్నాడు.
ఇషాన్‌ను జట్టులో ఉంచడం ద్వారా అదనపు ఆల్‌రౌండర్ లేదా ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు టీమ్ మేనేజ్మెంట్కు లభిస్తుందని చోప్రా విశ్లేషించాడు. ప్రస్తుతం జైస్వాల్ వన్డే జట్టులో కూడా లేకపోవడం అతడి ప్రపంచకప్ అవకాశాలను మరింత క్లిష్టం చేస్తుందని అన్నాడు.
మరోవైపు, నితీశ్ కుమార్ రెడ్డిలాంటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు అవకాశం ఉండొచ్చని, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా పరిస్థితులు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు సమతౌల్యంలో ఆ అంశం కీలకమవుతుందని చోప్రా పేర్కొన్నాడు.
ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి అవకాశాలు తగ్గుతున్నాయి: ఆకాశ్ చోప్రా
7