దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో మరోసారి పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. నవంబర్లో ఇంధన ధరల్లో పెరుగుదల ఉండవచ్చని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ముఖ్య ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మన్ ప్రసాద్ విశ్లేషించారు.
వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవంబర్లోనే ధరల సవరణ జరిగే అవకాశం ఉందని ఆమె అంచనా వేసినట్లు కథనం పేర్కొంది. గత మేలో జరిగిన ఇంధన ధరల పెంపులో సగం మేర ఈసారి పెరుగుదల ఉండవచ్చని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మేలో ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
ఇంధన ధరలు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2 శాతానికి, 2027 జనవరి-మార్చి కాలంలో 6.5 శాతానికి చేరవచ్చని అంచనా వేశారు.
మరోవైపు, ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతంగా, జనవరి-మార్చిలో 5.7 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ మాత్రం వచ్చే ఏడాది ధరల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది.
నవంబర్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం.. ద్రవ్యోల్బణంపై ఆందోళన
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri