అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాల ప్రభావంతో ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ భారీగా తగ్గినట్లు న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారు 26 వేల ఇమ్మిగ్రెంట్ వీసాలు మాత్రమే జారీ కాగా, ట్రంప్ అధికారంలోకి రాకముందు ఫిబ్రవరి నెల సగటు సుమారు 52 వేలుగా ఉన్నట్లు కథనం తెలిపింది.
వలసల నియంత్రణ కోసం అమెరికా ప్రభుత్వం గత కొంతకాలంగా పలు నిబంధనలను కఠినతరం చేసింది. వలసదారుల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడకుండా చూడటం, భద్రతాపరమైన సమస్యలను తగ్గించడం ఈ చర్యల ఉద్దేశమని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
ఈ విధానాల కారణంగా 91 దేశాల ప్రజలకు అమెరికాకు వలస వెళ్లడం మరింత కష్టంగా మారగా, మరో 61 దేశాలకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ తగ్గినట్లు విశ్లేషణ తెలిపింది. సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా, తూర్పు ఐరోపా, దక్షిణాసియా, దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన దేశాల్లో వీసాల జారీ గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది.
అయితే అన్ని దేశాల్లో ఒకే ధోరణి కనిపించలేదు. కెనడా, మెక్సికో నుంచి వలసలకు సంబంధించిన ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ పెరిగినట్లు కథనం తెలిపింది. 2023, 2024 నెలవారీ సగటులతో పోల్చి ఈ మార్పులను విశ్లేషించినట్లు పేర్కొంది.
ట్రంప్ విధానాల ప్రభావం.. అమెరికా ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ సగానికి తగ్గింది
3
Published: 📅
Reported by: 🖊
Kanakadri