ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టు 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సన్, కెప్టెన్ టెంబా బావుమాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇద్దరూ ఏడో వికెట్‌కు 132 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను గట్టెక్కించారు. జాన్సన్ 100 బంతుల్లో 85 పరుగులు చేసి సెంచరీకి దగ్గరగా వచ్చాడు. చివరకు స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ ఇన్నింగ్స్‌తో సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా జాన్సన్ నిలిచాడు. గతంలో 1966లో జోహెన్నెస్‌బర్గ్‌లో పీటర్ వాన్ డెర్ మెర్వె 76 పరుగులు చేసిన రికార్డును అతడు అధిగమించాడు.
అలాగే ఆస్ట్రేలియాపై టెస్టు ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్ల జాబితాలో జాన్సన్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రియాన్ మెక్‌మిలన్ 87 పరుగులతో ముందున్నాడు. మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 425 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, కెప్టెన్ టెంబా బావుమా 179 పరుగులతో కీలక పాత్ర పోషించాడు.
60 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన మార్కో జాన్సన్.. ఆస్ట్రేలియాపై అదరగొట్టిన ప్రొటీస్ ఆల్‌రౌండర్
11
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan