అణు కార్యక్రమంపై అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ మరోసారి కఠిన వైఖరి ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియంలో ఒక్క గ్రామును కూడా విదేశాలకు పంపే ప్రసక్తే లేదని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసేన్ రెజాయీ స్పష్టం చేశారు.
శుద్ధి చేసిన అణు పదార్థాలు ఇరాన్ ప్రజల జాతీయ సంపద అని, వాటిని దేశ అవసరాల కోసమే వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ టెహ్రాన్‌లో ఇరాన్ ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా షరతులు విధించారు. బెదిరింపుల వాతావరణంలో చర్చలు జరగవని, ముందుగా అమెరికా ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సైనిక బెదిరింపులను నిలిపివేయాలని కోరారు.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ కూడా అమెరికా ఏడు షరతులను నెరవేర్చాలని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, చమురు రంగంపై ఆంక్షల తొలగింపు వంటి అంశాలపై ఇరాన్ పట్టుదలగా ఉన్నట్లు కథనం తెలిపింది.
ఒక్క గ్రాము శుద్ధి చేసిన యురేనియం కూడా బయటకు పంపం: ఇరాన్
9
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk