బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈరోజు కొంత ఊరట లభించింది. సోమవారం పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹650 తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై ₹600, 18 క్యారెట్ల బంగారంపై ₹490 తగ్గింది.ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,54,150 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర ₹1,41,300గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹1,15,610 వద్ద ఉంది.తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో కూడా ఇదే స్థాయి ధరలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కడప, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,54,150, 22 క్యారెట్లు ₹1,41,300, 18 క్యారెట్లు ₹1,15,610గా ఉన్నాయి.దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ₹1,54,300, 22 క్యారెట్లు ₹1,41,450గా ఉంది. వడోదరా, ఇండోర్ వంటి నగరాల్లో కూడా ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసం ఉంది.బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్, కరెన్సీ మార్పులు, డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి నిరంతరం మారుతుంటాయి. అందువల్ల నగలు కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్‌లో తాజా ధరలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan