హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ సమావేశాలను శనివారం వరకు కొనసాగించాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా–గోదావరి జలాలు, విద్య, 22-ఏ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చ జరగనుంది.
స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన స్పీకర్ చాంబర్‌లో జరిగిన బీఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రతిపాదించారు. అయితే ఐదు రోజుల పాటు సభ నిర్వహించి, అవసరమైతే శనివారం మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచించారు.
22-ఏ భూముల అంశం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరు గ్యారెంటీల అమలు, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించాలని ప్రతిపక్షం కోరింది. 22-ఏ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
సభా సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కీలక అంశాలపై చర్చకు వేదిక కానుంది.
శనివారం వరకు అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం
15
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan