మాచర్ల, సెప్టెంబర్ 7: పల్నాడు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎత్తిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు సాహసంతో కూడిన కొత్త అనుభూతిని అందించేందుకు జిప్ లైన్, జిప్ సైకిల్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు.
పర్యాటకశాఖ సహకారంతో రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఈ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. ఎత్తిపోతల ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయమైన కుటుంబ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.
జిప్ లైన్ ద్వారా ఎత్తు నుంచి ప్రయాణిస్తూ ఎత్తిపోతల పరిసరాల్లోని ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం పర్యాటకులకు లభించనుంది. అలాగే జిప్ సైకిల్ సాహసోపేతమైన అనుభూతిని అందించనుంది. పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నాణ్యమైన పరికరాలు, భద్రతా ఏర్పాట్లు, శిక్షణ పొందిన సిబ్బందిని సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.1.71 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు, సెప్టెంబర్ 9న ప్రారంభించనున్నట్లు రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త సదుపాయాలతో ఎత్తిపోతల జలపాతం మరింత మంది పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది.
ఎత్తిపోతల జలపాతానికి కొత్త హంగులు.. ఇక సాహస పర్యాటకానికి వేదిక
7
Published: 📅
Reported by: 🖊
Sarika Sk