అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన (PM-SYM) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన కార్మికులు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్ పొందే అవకాశం ఉంటుంది.
18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న అసంఘటిత కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. కార్మికులు తమ వయస్సును బట్టి ప్రతి నెల రూ.60 నుంచి రూ.200 వరకు చెల్లించాలి. దీనికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూషన్‌గా జమ చేస్తుంది. 60 ఏళ్లు పూర్తైన తర్వాత కార్మికులకు ప్రతి నెల రూ.3 వేల పింఛన్ అందుతుంది.
ఒకవేళ పథకంలో చేరిన కార్మికుడు మరణిస్తే, కుటుంబానికి నెలవారీ పింఛన్‌లో 50 శాతం అంటే రూ.1,500 అందించే నిబంధన ఉంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి నెలవారీ ఆదాయం రూ.15 వేలలోపు ఉండాలి. పీఎఫ్ చెల్లించే కార్మికులు ఈ పథకానికి అర్హులు కారు.
వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, దోబీ కార్మికులు తదితర అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు.
దరఖాస్తు కోసం కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా లేదా సంబంధిత డిజిటల్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అవసరం అవుతాయి.
అసంఘటిత కార్మికులకు కేంద్రం భరోసా.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్
10
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati