హైదరాబాద్ పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని చారిత్రక ప్రాంతమైన ఓల్డ్‌సిటీకి మెట్రో రైలును వీలైనంత త్వరగా తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)కు ఆమోదం తెలిపిన వెంటనే పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రాధాన్యతను ప్రస్తావించారు. హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో విస్తరణ కీలకమని, అన్ని ప్రాంతాలకు ఆధునిక రవాణా సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గురువారం సైదాబాద్‌లో జరిగిన స్టీల్‌బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాతబస్తీ మెట్రోపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మెట్రో రైలులోనే ఓల్డ్‌సిటీకి వచ్చి ఇక్కడి ప్రజలను ఓట్లు అడుగుతానని ఆయన ప్రకటించారు.
సీఎం ప్రకటనతో పాతబస్తీ ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పాతబస్తీ మెట్రో కారిడార్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతుల ప్రక్రియ కీలక దశలో ఉన్నాయి. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత నిర్మాణ పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది.
పాతబస్తీ మెట్రోపై సీఎం రేవంత్ ఫోకస్.. త్వరలో పనులు ప్రారంభించే యోచన
14