కర్ణాటకలోని బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పు చెల్లించలేదన్న కోపంతో ఓ మహిళపై కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. మహిళను వివస్త్రను చేసి కొట్టడంతో పాటు, ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించారు. డబ్బులు త్వరగా చెల్లించకపోతే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన బాధితురాలు రేష్మ అనే మహిళ నుంచి కొన్ని నెలల క్రితం రూ.50 వేల అప్పు తీసుకుంది. ప్రతినెలా రూ.5 వేల చొప్పున చెల్లించేది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగు వారాల పాటు డబ్బులు చెల్లించలేకపోయింది. దీంతో రేష్మ తనను వేధిస్తుందేమోనని భయపడిన బాధితురాలు ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి మరో ఇంటికి మారిపోయింది.
ఆ తర్వాత నజ్రత్ అనే మహిళ బాధితురాలికి ఫోన్ చేసి పని ఇప్పిస్తానని, కొంత డబ్బు కూడా ఇస్తానని చెప్పింది. ఆమె ఇంటికి వెళ్లిన బాధితురాలిపై సొహైల్ అనే వ్యక్తి దాడి చేశాడు. అనంతరం నజ్రత్, సొహైల్, రేష్మ, సైఫ్ కలిసి ఆమెను కుంబల్‌గోడులోని ఓ ఇంటికి తీసుకెళ్లి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
అప్పు చెల్లించలేదని మహిళపై దారుణం.. వివస్త్రను చేసి దాడి, నలుగురు అరెస్ట్
7
Published: 📅
Reported by: 🖊
Sarika Sk