తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను అవమానించేలా, అసభ్యకరమైన భాషను ఉపయోగించడాన్ని తాము సహించబోమని ఆయన శాసనసభలో స్పష్టం చేశారు.ఇటీవల నటి త్రిషను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే వివాదం నేపథ్యంలో సీఎం విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు.తన సినీ ప్రయాణంలోనూ, రాజకీయ జీవితంలోనూ మహిళల సహకారం ఎంతో ఉందని విజయ్ గుర్తుచేశారు. ఇంట్లో తల్లులు, సోదరీమణులను ఎలా గౌరవిస్తామో, సమాజంలో కూడా మహిళలకు అదే గౌరవం ఇవ్వాలని కోరారు.ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ద్వంద్వార్థాలు, అశ్లీల పదజాలంతో మాట్లాడే ధోరణి పెరిగిందని సీఎం వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.అదే సమయంలో డీఎంకే వర్గాలు మాత్రం ఉదయనిధి స్టాలిన్ ఎలాంటి నటి పేరును ప్రస్తావించలేదని, రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించాయి.
త్రిష వివాదంపై సీఎం విజయ్ సీరియస్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదని హెచ్చరిక
17
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan