నెల్లూరు, సెప్టెంబర్ 9: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ అభివృద్ధి, సామాజిక విలువలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు దేశాన్ని చులకన చేసేలా విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. పరిపాలనలో లోపాలు ఉంటే, సమస్యలు పరిష్కారం కాకుంటే వాటిని విమర్శించడం సమంజసమేనని తెలిపారు. అయితే వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులు, మహిళలపై వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
పల్లెటూరిలో పుట్టినప్పటికీ దేశ స్థాయిలో ప్రభుత్వ, పార్టీ పదవులు చేపట్టే అవకాశం తనకు లభించిందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో గ్రామీణ సడఖ్ రోడ్లు, జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందని వెంకయ్య గుర్తుచేశారు. దేశ నిర్మాణంలో మౌలిక వసతుల ప్రాధాన్యతను వివరించారు.
పాఠశాలల్లో మానవతా విలువలు నేర్పే మోరల్ క్లాసులు నిర్వహించాలని ఆయన సూచించారు. స్కూళ్లలో ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని, సోషల్ మీడియా దుర్వినియోగం సమాజానికి హానికరంగా మారుతోందని పేర్కొన్నారు. చట్టసభల్లో గౌరవంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దేశాన్ని చులకన చేసేలా విమర్శలు సరికాదు: వెంకయ్య నాయుడు
11
Published: 📅
Reported by: 🖊
Banu Prakash