న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: స్వతంత్ర జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ కేసులో సుప్రీంకోర్టు యూపీ గాజియాబాద్ పోలీసుల తీరుపై ప్రశ్నలు సంధించింది. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ అంశాన్ని బయటపెట్టిన అభిషేక్‌పై నమోదైన కేసులో భాగంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ నుంచి ఆయన సమాచారం ఎందుకు కోరారని ధర్మాసనం ప్రశ్నించింది.
వివరాల్లోకి వెళితే.. అభిషేక్ ఉపాధ్యాయ్ తన కారును ప్రమాదకరంగా నడిపి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టారని, అనంతరం తనను దూషించి బెదిరించారని నిక్కీ గౌతమ్ అనే వ్యక్తి గాజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా, అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రమాదకర డ్రైవింగ్ కేసు దర్యాప్తులో నిందితుడి డిజిటల్ పాదముద్రలు ఎందుకు అవసరమో వివరించాలని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే పోలీసులు కోరిన సమాచారం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని సూచించింది.
ఈ వ్యవహారంలో వ్యక్తిగత డిజిటల్ సమాచార వినియోగంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘ఎక్స్’ నుంచి జర్నలిస్టు సమాచారం ఎందుకు? యూపీ పోలీసులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
5
Published: 📅
Reported by: 🖊
Kanakadri