దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్‌లో ఐదంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. సహాయక బృందాలు ఇప్పటివరకు 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ప్రమాదానికి గురైన భవనాన్ని సుమారు 75 పడకల సామర్థ్యంతో పేయింగ్ గెస్ట్ వసతిగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలో ఉండటంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ భవనం సుమారు 40 నుంచి 50 ఏళ్ల నాటిదని పోలీసులు తెలిపారు. కింది భాగంలో బేస్‌మెంట్‌తో పాటు పైన ఐదు అంతస్తులు ఉన్నాయి. ప్రమాద సమయంలో బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ పనులకు భవనం కూలిపోవడానికి సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీ హాస్టల్ భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు సానుభూతి
13
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan