అమరావతి, సెప్టెంబర్ 10: జిల్లా కలెక్టర్లు ఈగోలకు దూరంగా ప్రజల కోసం పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రజా సేవకులుగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో లీడర్‌షిప్, జీఎస్‌డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ వంటి అంశాలపై చర్చించారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, భవిష్యత్ లక్ష్యాలపై కూడా సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో 27 నెలల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు ఖర్చు చేశామని వివరించారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర ప్రగతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ పాలనలో సంస్కరణలు, సాంకేతిక వినియోగం, ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అవసరమని చంద్రబాబు చెప్పారు. ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే అభివృద్ధి, పాలన కూడా ఆలస్యమవుతాయని పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని సూచించారు.
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపు
5
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla