ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. ఎన్నికలు ముగిసిన వెంటనే యుద్ధం ఆగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ ఎక్కువ రోజులు యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదని, ఎన్నికలను ప్రభావితం చేసేందుకు టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఇరాన్‌తో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉందని ట్రంప్ సలహాదారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇది అధ్యక్ష పదవీ కాలంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వారు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని కథనంలో పేర్కొన్నారు.
ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇరాన్ నేతలు అందుకు సానుకూలంగా స్పందించడం లేదని సమాచారం. హోర్ముజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా స్థావరంపై మిసైల్ దాడులు చేసినట్లు కథనం పేర్కొంది.
మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
3
Published: 📅
Reported by: 🖊
Banu Prakash