అమరావతి, సెప్టెంబర్ 11: మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలకు ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై విమర్శలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వీడియో విడుదల చేసి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి ఉన్న తేడా జగన్‌కు తెలుసా అని లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో టీచర్ పోస్టుల భర్తీ సంఖ్య సున్నా అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారని తెలిపారు. ఈ డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు.
డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు సుమారు 300 కేసులు వేశారని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ కేసుల విచారణ సమయంలో ప్రభుత్వాన్ని కోర్టులు తప్పుపట్టలేదని పేర్కొన్నారు.
డీఎస్సీపై వచ్చిన ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సమాధానం ఇచ్చారని లోకేశ్ తెలిపారు. టీచర్లపై ఒత్తిళ్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు, అనంతర న్యాయ ప్రక్రియ గురించి కూడా ప్రస్తావించారు. మూడేళ్లుగా సాగిన న్యాయ ప్రక్రియ పూర్తై చంద్రబాబుకు క్లీన్ చిట్ వచ్చిందని తెలిపారు.
మెగా డీఎస్సీపై జగన్ విమర్శలకు లోకేశ్ కౌంటర్.. త్వరలో కొత్త నోటిఫికేషన్
6
Published: 📅
Reported by: 🖊
Banu Prakash