అమరావతి, సెప్టెంబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని అధికారులు వివరించారు.
తెలంగాణలో సెప్టెంబర్ 14 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అలర్ట్
7
Published: 📅
Reported by: 🖊
Banu Prakash